![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -285 లో.. కళ్యాణ్, అప్పు ఇద్దరు మాట్లాడుకుంటుంటే అనామిక వచ్చి.. అప్పుని బయటకు వెళ్లి ఎవరు రాకుండా కాపలా ఉండమని చెప్తుంది. ఏంటి అప్పుని అలా అంటున్నావని కళ్యాణ్ అంటాడు. ఏమి పర్లేదులే నువ్వు వెళ్ళు డోర్ దగ్గర ఉండని అనామిక చెప్పగా.. అప్పు బాధగా వెళ్లిపోతుంది.
అ తర్వాత నేను ఒకతే కూతురిని, మా వాళ్ళకు పెళ్లి తర్వాత కూడా సపోర్ట్ గా ఉంటాను. నువ్వు కూడా ఉండాలని కళ్యాణ్ కి అనామిక చెప్తుంది. ఉంటాను కానీ ఎందుకు అలా చెప్తున్నావని కళ్యాణ్ అడుగుతాడు. ఏమి లేదు నువ్వు ఉంటానని మాట ఇవ్వని అనామిక అనగానే.. తన చేతిలో చెయ్యి వేసి కళ్యాణ్ మాట ఇస్తాడు. దాంతో అనామిక హ్యాపీగా ఫీల్ అవుతు కళ్యాణ్ ని హగ్ చేసుకుంటుంది. అప్పుడే ధాన్యలక్ష్మి, ప్రకాష్ ఇద్దరు కళ్యాణ్ దగ్గరికి వెళ్ళబోతుంటే అప్పు ఆపుతుంది. అయిన వాళ్ళు ఆగకుండా లోపలికి వెళ్తారు. అనామిక, కళ్యాణ్ ఇద్దరు వాళ్ళని చూసి సిగ్గుపడతారు. అప్పు మాత్రం బాధగా చూస్తుంది. మరొకవైపు రాహుల్, రుద్రాణి ఇద్దరు కలిసి మళ్ళీ స్వప్నకి ప్రాబ్లమ్ క్రియేట్ చెయ్యడానికి ప్లాన్ చేస్తారు. అందులో భాగంగా అరుణ్ కి రాహుల్ ఫోన్ చేసి.. వచ్చి స్వప్నకి మాత్రమే కన్పించు అని చెప్తాడు. మరోక వైపు అరుణ్ ఫోన్ చేసిన విషయం కావ్యకి స్వప్న చెప్తుంది. నువ్వు ఏమి టెన్షన్ పడకు. ఏమి చేసుకుంటావో చేసుకో, నాకు సంబంధం లేదని చెప్పమని స్వప్నకి కావ్య సలహా ఇస్తుంది.
మరొకవైపు అనామిక, కళ్యాణ్ ల హల్ది జరుగుతుంది. అందరు సరదాగా ఉంటారు. కళ్యాణ్ అప్పుని పక్కనే ఉండమని చెప్తాడు. కళ్యాణ్ పసుపుని అనామికకి పూయబోతుంటే అప్పుకి అంటుతుంది. దాంతో అనామిక వాళ్ళ అమ్మ కోపంగా అక్కడ ఉన్న అప్పుని పక్కకి తీసుకోని వెళ్తుంది. మరొకవైపు అన్ని జంటలు హల్ది సంబరాలలో ఉంటారు. అదేసమయంలో కళ్యాణ్ తో అంత క్లోజ్ గా ఉంటున్నావ్ సిగ్గు లేదా అంటు అనామిక పేరెంట్స్ అప్పుని తిడుతుంటారు. అది కనకం కృష్ణమూర్తి ఇద్దరు చూసి.. మా అమ్మాయి ఏమి తప్పు చెయ్యలేదని కనకం అంటుంది. అప్పు బాధపడుతు ఉంటుంది. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |